చిత్రాంగదగా ముస్తాబైన సీతమ్మ

Wednesday,March 01,2017 - 06:30 by Z_CLU

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో సీతమ్మగా మెప్పించిన అంజలి మరో సినిమాతో రెడీ అయింది. గీతాంజలి లాంటి డిఫరెంట్ మూవీస్ తో కూడా సక్సెస్ అందుకున్న ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు అలాంటిదే మరో డిఫరెంట్ మూవీతో రెడీ అయింది. ఆమె నటించిన చిత్రాంగద మూవీ ఈనెల 10న విడుదలకానుంది.

తమిళంలో యార్నీ పేరుతో తెరకెక్కిన ఈ హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజున ఈ సినిమా విడుదలవుతుంది.

కొన్ని అదృశ్య శక్తుల కారణంగా అంజలి జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే ఈ సినిమా స్టోరీ.