ఇండస్ట్రీకి ఎందుకొచ్చానో ఈ సినిమాతో అర్ధమైంది. - రామ్

Saturday,October 14,2017 - 11:20 by Z_CLU

రామ్ – కిషోర్ తిరుమల – దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏవైటింగ్ మూవీ ‘ఉన్నదీ ఒకటే జిందగీ’… అక్టోబర్ 27 థియేటర్స్ కి రానున్న ఈ సినిమా ఆడియో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ ఆడియోలో సినిమా గురించి తన దైన స్టైల్ లో మాట్లాడి సినిమాపై  అంచనాలు పెంచాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్…

ఈ సినిమా గురించి రామ్ మాట్లాడుతూ ” ‘ఉన్నది ఒకటే జిందగీ’ నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా…ఎందుకో చెప్పడానికి చాలా కారణాలున్నాయి. సినిమాకు నాలుగు పిల్లర్లు.. అందులో మొదటి పిల్లర్ దేవి శ్రీ ప్రసాద్, రెండో పిల్లర్ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు, మూడో పిల్లర్ పెద్దనాన్న గారు, నాలుగో పిల్లర్ కిషోర్ గారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో వాట్ ఈజ్ ది యు.ఎస్.పి ఆఫ్ ది ఫిలిం..? అన్నారు. వాట్ అమ్మ వాట్ ఈజ్ థిస్ అమ్మ.. సినిమాలో డి.ఎస్.పి ఉండగా ఇంకా యు.ఎస్.పి ఏంటి..? అన్నాను. రి రికార్డింగ్ చూసి బ్లాంక్ అయిపోయింది. స్పీచ్ లెస్ వర్క్ తనది. తన వర్క్ తో లవ్ యూ చెప్తుంటాడు.. నేను మళ్ళీ లవ్ యు టూ అనేస్తుంటా.. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. కిషోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ సినిమాతో ఇండస్ట్రీ కి ఎందుకొచ్చానో.. అర్ధం అయింది. మహా క్యారెక్టర్ లో అనుపమ ది బెస్ట్ అనిపిస్తే, మ్యాగీ క్యారెక్టర్ లో లావణ్య త్రిపాఠి తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. శ్రీ విష్ణు సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్ గా చేసాడు. షూటింగ్ ఫస్ట్ డే నుంచే మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. కొన్ని సీన్స్ లో తన పెర్ఫార్మెన్స్ తో చింపేశాడు. సినిమాలో ఏ ఒక్క ఫ్రెండ్ క్యారెక్టర్ తీసేసినా కథ ముందుకు జరగదు. అది ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ” అన్నారు.