మెరుపు తీగలు 2016

Wednesday,December 21,2016 - 01:21 by Z_CLU

న్యూ రిజల్యూషన్స్, సరికొత్త ఇన్స్ పిరేషన్ తో సరిగ్గా సంవత్సరం క్రితం స్టార్ట్ అయిన 2016 టాలీవుడ్.. చాలా ఎగ్జైటైడ్ మూమెంట్స్ ని మిగిల్చింది. సర్ ప్రైజెస్ తో మెస్మరైజ్ చేసింది. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ తో కొత్త పాఠాలు కూడా నేర్పింది. జస్ట్ అప్ కమింగ్ స్టార్స్ ని కూడా టాప్ రేంజ్ కి తీసుకెవెళ్ళింది. అలా 2016లో మెప్పించిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

rakul_preet_singh-4

గతంలోనూ భారీ సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ రైట్ ట్రాక్ లో పడింది మాత్రం 2016 లో నటించిన నాన్నకు ప్రేమతో సినిమాతోనే. ఆ సినిమా తరవాత రిలీజైన సరైనోడు, ధృవ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి రకుల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే స్పీడ్ తో మహేష్ బాబు, మురుగదాస్ సినిమాలోను హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఈ వెంచర్ 2017 లో రిలీజవుతుంది.

samantha-2

2016 లో ట్రెండీ హీరోయిన్స్ లో సమంతా ఫస్ట్ లిస్టు లో ఉంటుంది. నిజానికి ఈ సంవత్సరం సమంతాకెన్ని సర్ ప్రైజెస్ ఇచ్చిందో, సమంతా కూడా ఫ్యాన్స్ కి అన్ని సర్ ప్రైజెస్ తో మెస్మరైజ్ చేసింది. బ్రహ్మోత్సవం, అ.. ఆ, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తరవాత స్మాల్ బ్రేక్ తీసుకున్న సమంతా కొత్త సంవత్సరం మరిన్ని సినిమాలతో, సర్ ప్రైజెస్ తో రెడీ అవుతోంది.

keerthy-suresh

తమిళ్, మలయాళంలో అడపాదడపా సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న కీర్తి సురేష్, నేను శైలజ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు టాలీవుడ్ లో ఎవరికీ తెలీదు. 2016 స్టార్టింగ్ లో రిలీజైన ఈ సినిమా కీర్తి లైఫ్ లో చూపిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. నాని మూవీతో పాటు… న్యూ ఇయర్ లో ఏకంగా పవన్ సరసన ఛాన్స్ కొట్టేసింది.

hebah-patel-1

ఒకటా రెండా ఏకంగా మూడు హిట్స్… ఈడోరకం-ఆడోరకంతో స్టార్ట్ అయితే రీసెంట్ గా రిలీజైన ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలతో హిట్స్ ని బ్యాగ్ లో వేసుకున్న హెబ్బ పటేల్… 2016లో యంగ్ స్టర్స్ కి దిల్ కీ ధడ్కన్ అనిపించుకుంది. ఆల్ రెడీ వరస సినిమాలతో 2017 ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది కూడా.

shruti-haasan

సంవత్సరానికి మినిమం 2-3సినిమాలతో అలరించే శృతి హాసన్ 2016 లో మాత్రం జస్ట్ ప్రేమమ్ తోనే సరిపెట్టింది. ఇప్పటికే సౌత్ ఇండియన్ సినిమాలో ఆల్ రౌండర్ అనిపించుకున్న శృతి హాసన్, ప్రేమమ్ సినిమాలో మాత్రం సాఫ్ట్ అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ తో యూత్ కి మరింత దగ్గరయింది. ప్రస్తుతం శభాష్ నాయుడు లో ఫస్ట్ టైం కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్న శృతి హాసన్.. 2017కు సంబంధించి ఇప్పటికే పవన్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.

lavanya-tripati

మంచి బ్లాక్ బస్టర్ పడితే కరియర్ ట్రాక్ లో పడుతుంది అని ఫీలయ్యే టైంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా” తో ఆ లోటు తీర్చుకుంది లావణ్య. 2016లో రిలీజయిన ఈ సినిమానే ఆమె కెరీర్ లో ఇప్పటివరకు ది బెస్ట్. ఈ సినిమా తరవాత లచ్చిం దేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు సినిమాల్లో నటించిన లావణ్య కమర్షియల్ హీరోయిన్ క్యాటగిరీలో చేరిపోయింది. 2017 ని కూడా అదే ఊపులో పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది ఈ అందాల రాక్షసి.

tamannaah-still

2016లో రిలీజైన తమన్నా ఫస్ట్ మూవీ స్పీడున్నోడు. ఆ టైటిల్ కి తగ్గట్టే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ స్పీడ్ గా ప్లాన్ చేసుకుంది మిల్కీ బ్యూటీ. ఇతర భాషల్లోనూ వరస సినిమాలతో బిజీగా ఉన్న తమన్న… ఒక్క తెలుగులోనే నాలుగు సినిమాలు చేసింది. కమర్షియల్ సినిమాలతో పాటు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తున్న తమన్నా 2017 కూడా మ్యాగ్జిమం షెడ్యూల్స్ తో ప్యాక్ అయిపోయి ఉంది.

kajal-2-agawarwal
2016 లో కాజల్ ఎన్ని సినిమాలు చేసింది అన్న డిస్కషన్ కి ముందు, ఈ ఇయర్ కాజల్ కొట్టేసిన బంపర్ చాన్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. మెగాస్టార్ 150 వ సినిమాలో చాన్స్ కొట్టేసిన ఈ చందమామ, దానికంటే ముందు 2 బిగ్ మూవీస్ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లో నటించింది.

nivetha-final

టాలీవుడ్ లో టాలెంట్ కు లోటు లేదు. కావాల్సింది టైం. నివేద థామస్ కరియర్ లో అలాంటి బెస్ట్ టైం వచ్చింది 2016లోనే. ఒక్క జెంటిల్ మెన్ సినిమాతోనే జెట్ స్పీడ్ ని అందుకున్న నివేద థామస్ కరియర్ ఇప్పుడు కొత్త కొత్త వెంచర్స్ తో ఎగ్జైటెడ్ గా తయారయింది. ప్రస్తుతం నానితో మరో సినిమాతో సెట్స్ పై ఉన్న నివేద, టైం దొరికినప్పుడల్లా, తన కోసం క్యూ కట్టిన సినిమాలను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది.

raashi-khanna

బెల్లం శ్రీదేవి గా యూత్ గుండెల్లో గూడు కట్టేసుకున్న రాశిఖన్నా, 2016 లో రిలీజైన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అనిపించుకున్నాయి. సుప్రీమ్, హైపర్ సినిమాల సక్సెస్ తో బిజీ అయిపోయిన రాశిఖన్నా, ప్రస్తుతం గోపీచంద్ సినిమాతో ‘ఆక్సిజన్’ సెట్స్ పై ఉంది. ఈ సినిమా 2017 రిలీజ్ కి రెడీ అవుతుంది.