కమల్ హాసన్ కొత్త సినిమా మళ్ళీ ట్రాక్ పైకి...

Saturday,October 06,2018 - 02:06 by Z_CLU

కమల్ హాసన్ ‘శభాష్ నాయుడు’ మళ్ళీ ట్రాక్ పైకి రానుంది. అనుకోని కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ స్పీడందుకోనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్పై కామెడీ అడ్వెంచరస్ మూవీ కొత్త షెడ్యూల్ ని, త్వరలో హైదరాబాద్ బిగిన్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

ఇప్పటికే అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా యూనిట్, ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. త్వరలో సెట్స్ పైకి రానున్న ఇండియన్ – 2 సినిమా కన్నా ముందే ఈ సినిమాకు ప్యాకప్ చెప్పాలనే ఆలోచనలో ఉన్న కమలహాసన్, ఈ సినిమా పనులను వేగవంతంగా కంప్లీట్ చేయబోతున్నాడు.

కమలహాసన్ ఈ సినిమాలో కామిక్ RAW ఏజెంట్ గా కనిపించనున్నాడు. అమెరికాలో ఉన్న తన కూతురిని కాపాడుకునే ప్రాసెస్ లో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తుంది. రమ్యకృష్ణ, శృతి హాసన్ తో పాటు బ్రహ్మానందం ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.