30 క్రాస్ చేసిన మెరుపు తీగలు

Thursday,November 17,2016 - 05:30 by Z_CLU

హీరోయిన్లకు 30 దాటితే అవకాశాలు కష్టమే. ఇండస్ట్రీలో ఒకప్పుడు మాటిది. ఇప్పుడు మాత్రం ఇది రివర్స్. థర్టీ ప్లస్ లో కూడా వరుస అవకాశాలతో తారాజువ్వల్లా దూసుకుపోతున్నార కొందరు భామలు. వయసు మీదపడుతున్న చెక్కుచెదరని గ్లామర్ తో కిర్రాక్ పుట్టిస్తున్నారు.

kajal

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చందమామ, టాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ ప్రిన్సెస్ అనిపించుకుంది. జూన్ 19, 1985 న పుట్టిన కాజల్, ముప్పైదాటినా అటు గ్రేస్, ఇటు క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా
దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్ “ఖైదీ నం 150” లో హీరోయిన్ గా నటిస్తోంది.

anushka

సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బొమ్మాళి, బాహుబలితో టాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. నవంబర్ 7, 1981 లో పుట్టిన అనుష్క ప్రస్తుతం డిమాండ్ లో హీరోయిన్స్ అందరిలోను పీక్ స్టేజ్ లో ఉంది. కాస్త హిస్టారికల్ టచ్ తో ఉండే కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అందులో అనుష్క ఉండాల్సిందే.

trisha

నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన త్రిష, ఇప్పటికీ యూత్ ఫేవరేట్ స్టారే. 19 జూన్ 1983 లో పుట్టిన త్రిష మూడు పదుల వయసు ఎప్పుడో దాటేసింది. కానీ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

nayan

ఎప్పుడో 2005 లో సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖితో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన నయనతార…నవంబర్ 18, 1984 లో జన్మించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. రీసెంట్గా ‘బాబు బంగారం’ సినిమాలో నటించిన నయనతార… కార్తీ కాష్మోరాలోనూ స్పెషల్ క్యారెక్టర్ లో అలరించింది.

priyamani

పక్కింటమ్మాయిలా కనిపించే ప్రియమణి ‘ఎవరే అతగాడు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయింది. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మన ఊరి రామాయణం’ లోనూ నటించిన ప్రియమణి… రెండేళ్ల కిందటే 30 క్రాస్ చేసింది.

shruti

అనగనగా ఓ ధీరుడు తో తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కూడా కళ్లముందే 30 దాటేసింది. రీసెంట్ గా రిలీజైన సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ తరవాత, అటు స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే, స్పెషల్ సాంగ్స్ ల్లోనూ సెగ పుట్టిస్తూ బిజీ బిజీగా ఉందీ చాక్లెట్ గర్ల్.

shriya

శ్రియ సక్సెస్ ని ముందే గెస్ చేసి ఉంటారు దర్శక నిర్మాతలు . అందుకే తనను తెలుగు తెరకు పరిచయం చేస్తూనే, ఆ సినిమాకు ‘ఇష్టం’ అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ తో అన్ని భాషల్లో కలిపి 69 సినిమాలు పూర్తి చేసుకోనున్న శ్రియ… 30దాటినా తగ్గని జోష్ తో దూసుకుపోతోంది.

anjali

‘షాపింగ్ మాల్’ లో కనిపించింది ఫస్ట్ టైం. ఏ మాత్రం మేకప్ లేకుండానే న్యాచురల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న అంజలి, తెలుగు స్క్రీన్ పై మిలీనియం సీతమ్మే. రొటీన్ హీరోయిన్ మార్క్ పై మోజు పడకుండా, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ, జాగ్రత్తగా కరియర్ ని ప్లాన్ చేసుకుంటుందీ గడుసు పిల్ల. 16 జూన్ 1986 న పుట్టిన అంజలి కూడా జస్ట్ ఈమధ్యే 30 క్రాస్ అయింది.