గోపీచంద్ గౌతమ్ నంద టీజర్

Monday,June 12,2017 - 02:41 by Z_CLU

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గౌతమ్ నంద’ టీజర్ రిలీజయింది. గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసినప్పుడే గోపీచంద్ ఈ సినిమాలో అల్టిమేట్ స్టైల్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడని క్లారిటీ వచ్చినా, ఈ సినిమా కూడా అంతే లావిష్ గా, స్తైలిష్ గా ఉండబోతుందని కన్ఫం చేసింది లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్.

హన్సిక మోత్వాని, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. గోపీచంద్ కరియర్ లోనే డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది.  ఈ సినిమాని J. పుల్లారావు, J. భగవాన్ కలిసి నిర్మిస్తున్నారు.