రీసెంట్ టైమ్స్ లో ‘అర్జున్’ హడావిడి

Thursday,April 25,2019 - 10:02 by Z_CLU

నాని ‘జెర్సీ సినిమా తలుచుకుంటే చాలు ‘అర్జున్’ గుర్తొస్తాడు. ఆఫ్ కోర్స్ నాని ఆ క్యారెక్టర్ లో అంత బాగా సింక్ అయ్యాడు. ఇక ఆడియెన్స్ కూడా ఆ క్యారెక్టర్ కి  అదే స్థాయిలో కనెక్ట్ అయ్యారు. అయితే సినిమాలో అర్జున్ క్యారెక్టరైజేషన్ వరకు వస్తే అనుమానం లేదు గౌతమ్ చాలా బాగా రాసుకున్నాడు. ఆ క్యారెక్టర్ ని అంత బాగా రాసుకుని ఎంత సక్సెస్ అయ్యాడో, ఆ క్యారెక్టర్ కి అర్జున్ అని పేరు ఫిక్స్ చేసుకుని కూడా  అంతే మంచి పని చేశాడు.

 

సినిమాలో హీరో పేరు అర్జున్ అయితే చాలు సినిమా హిట్టయిపోతుంది. ఇది ప్రాక్టికల్ గా ఎంత వర్కవుట్ అవుతుందో పక్కాగా చెప్పలేం కానీ రీసెంట్ టైమ్స్ లో అర్జున్ గా వచ్చిన ప్రతి హీరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ కూడా అంతే. సినిమా జోనర్… క్రేజ్ అవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ స్ట్రీట్స్ లో కొన్ని నెలల వరకు ‘అర్జున్ రెడ్డి’ పేరు వినబడుతూనే ఉంది.

 

ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న ‘అర్జున్ సురవరం’ కూడా అంతే. ఈ సినిమాకి ఇంతకుముందు ‘ముద్ర అని టైటిల్ ఫిక్సయినా, తరవాత సినిమాలో హీరో పేరుతోనే ‘అర్జున్ సురవరం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ చూస్తుంటే ఈ అర్జున్ కూడా అందరికీ నచ్చేసే సూచనలే కనిపిస్తున్నాయి.

 

ఈ అర్జున్ సెంటిమెంట్ నిజంగానే అంత బలంగా ఫిక్సయిందని చెప్పలేం కానీ,  ‘అర్జున్ సురవరం’  కూడా అంతే స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ దగ్గర ఆడితే మాత్రం డెఫ్ఫినెట్ గా మరింత మంది ఆన్ స్క్రీన్ అర్జున్ లు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.