Uppena ఆ సాంగ్ అదిరిందంటున్నారే !

Friday,February 05,2021 - 03:14 by Z_CLU

కొన్ని పాటలు సినిమా రిలీజ్ కి ముందే పాపులర్ అయితే కొన్ని పాటలు మాత్రం రిలీజ్  తర్వాత క్లిక్ అవుతాయి. ‘రంగస్థలం’ లో ఓరయ్యో నా అయ్యో’ అనే సాంగ్ సినిమా రిలీజయ్యాక ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అలాంటి మరో పాటే ఇప్పుడు ‘ఉప్పెన‘ కోసం కంపోజ్ చేసాడట దేవి శ్రీ ప్రసాద్. సినిమాలో ఓ ఎమోషనల్ స్విచువేషన్ లో వచ్చే ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా పాడాడని తెలుస్తుంది. “శివా” అంటూ సాగే ఈ పాటలో  దేవి వాయిస్ తో పాటు చంద్రబోస్ అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోసిందని అంటున్నారు. ఈ సాంగ్ ను డైరెక్ట్ గా జ్యూక్ బాక్స్ లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

Dsp-composed-emotional-song-for-uppena

ప్రస్తుతం రిలీజ్ చేసిన సింగిల్స్ విడుదలకి ముందు హంగామా చేస్తుంటే ఈ సాంగ్ మాత్రం రిలీజ్ తర్వాత అందరి నోళ్ళల్లో నానడం ఖాయమని ఇన్సైడ్ టాక్. మరి త్వరలోనే జ్యుక్ బాక్స్ లో రానున్న ఈ పాట రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Also Check ‘ఉప్పెన’ కోసం మెగాస్టార్ !