'ఉప్పెన' కోసం Megastar

Tuesday,February 02,2021 - 01:12 by Z_CLU

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన'సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి భారీ ప్రమోషన్   ప్లాన్ రెడీ చేసారు మేకర్స్. ట్రైలర్ ను ఎన్టీఆర్ తో లాంచ్ చేయించబోతున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు కానీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్ చిరంజీవి కన్ఫర్మ్ అయ్యారు. 

ట్రైలర్ రిలీజయిన రెండు, మూడు రోజులకే ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ తో పాటు మెగాస్టార్ గెస్ట్ అనే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారు. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఇటివలే సినిమా చూసిన చిరు తనే స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి సినిమా గురించి తన ఎక్స్ పీరియన్స్ ప్రేక్షకులతో చెప్తానన్నారట.

మరి ఈవెంట్ లో చిరు తన ఎక్స్ పీరియన్స్ తో పాటు తన మేనల్లుడు గురించి మిగతా టీం గురించి ప్రత్యేకంగా మాట్లాడి వేదికపై మెరుపులు మెరిపించడం ఖాయం. ఈ ఈవెంట్ కి మిగతా మెగా హీరోలు కూడా హాజరవుతారని సమాచారం.

బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్  బ్యానర్స్ పై తెరకెక్కింది.

Also Check ఉప్పెన టీజర్ రివ్యూ