Theaters ఇక నుండి 100 పర్సెంట్ !

Friday,February 05,2021 - 03:30 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమల కంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయ్యింది. ఈ విషయం అందరికి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆగిపోవడం , రిలీజ్ లు వాయిదా పడటం ఇలా నిర్మాతలు అలా కష్టాలు చూశారు. ఇక లాక్ డౌన్ తర్వాత కూడా థియేటర్స్ లో 50 % సీటింగ్ కెపాసిటీ వల్ల అటు ఎగ్జిబ్యుటర్లు , ఇటు డిస్ట్రిబ్యుటర్స్ బాగా నష్టపోయారు. తాజాగా ఈ సమస్యకి పరిష్కారం లభించింది. తెలంగాణా ప్రభుత్వం ఇకపై 100 % సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడుపుకోవచ్చని ఆర్డర్ ఇష్యూ చేసింది.

దీంతో నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబ్యూటర్స్ తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తెలంగాణా ప్రభుత్వానికి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి వచ్చే వారం నుండి రిలీజ్ అవ్వనున్న సినిమాలకు తాజాగా వెలువడిన ఈ ప్రకటన మంచి ఊరటనిస్తుంది. ఇకపై 100% సీటింగ్ టికెట్స్ తో మన సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయో చూడాలి.