మరికొన్ని గంటల్లో గ్రాండ్ రిలీజ్

Wednesday,September 26,2018 - 11:57 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ ఇద్దర్ని కదిపినా దేవదాస్ ముచ్చట్లే. అందరి ఫోకస్ ఈ సినిమాపైనే. అంతలా ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఏపీ, నైజాంలో గ్రాండ్ గా విడుదలకానుంది. ఇక ఓవర్సీస్ లో మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి.

నాగార్జున, నాని కలిసి చేయడమే దేవదాస్ ప్రాజెక్టుకు మెయిన్ హైలెట్. దీని తర్వాత అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ స్టోరీలైన్. గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిరత్నం సంగీతం అందించాడు.