మెగాస్టార్ ‘సైరా’ లో లక్ష్మీరాయ్
Wednesday,September 26,2018 - 11:02 by Z_CLU
మెగాస్టార్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సైరా’. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ అని టార్గెట్ పెట్టుకున్న ఫిలిమ్ మేకర్స్, పక్కా ప్లాన్డ్ గా షూటింగ్ జరుపుకుంటున్నారు. అయితే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్ష్మీరాయ్ కూడా నటించనుందని తెలుస్తుంది.
గతంలో మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ స్పెషల్ సాంగ్ లో నటించి మాస్ ఆడియెన్స్ ని మెప్పించిన లక్ష్మీరాయ్, మరోసారి మెగాస్టార్ సరసన స్టెప్పులేసే చాన్స్ కొట్టేసిందన్న టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దానికి తోడు రీసెంట్ గా లక్ష్మీరాయ్ చిరు ఇంటికి రావడం, మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి కూడా, ఈ టాక్ కి మరింత బలాన్ని ఆడ్ చేస్తున్నాయి.

సురేదర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాట్టు లక్ష్మీరాయ్ నటిస్తుందా లేదా..? అనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరకాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘సైరా’ ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.
