గ్రాండ్ గా రిలీజయిన దేవదాస్

Thursday,September 27,2018 - 10:05 by Z_CLU

గ్రాండ్ గా రిలీజయింది నాగార్జున, నాని ల మల్టీస్టారర్ దేవదాస్. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో క్యూరియాసిటీ రేజ్ చేసిన ఈ సినిమా, ఫస్ట్ షో తోనే హిట్ టాక్ దక్కించుకుంటుంది.

ఓవర్ సీస్ లో 198 లొకేషన్ లలో రిలీజైన ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకుంటుంది. నవ్వించడమే టార్గెట్ గా తెరకెక్కిన ఈ సినిమా, ఆడియెన్స్ చేత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా నాని, నాగార్జున కాంబినేషన్ లో ఉన్న సీన్స్ కి ఆడియెన్స్ నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్ స్క్రీన్ పై గ్రాండియర్ గా ఎలివేట్ అవుతున్నాయి. వైజయంతీ బ్యానర్ వ్యాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లో ఎలివేట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య, ఈ సినిమాతో ఈజీగా హ్యాట్రిక్ కొట్టేశాడు. రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ దేవదాస్ కి పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించుకుంటున్నారు.