ఓవర్సీస్ లో దేవదాస్ హంగామా.. లేటెస్ట్ కలెక్షన్

Sunday,September 30,2018 - 01:00 by Z_CLU

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా దేవదాస్ హంగామా కొనసాగుతోంది. విడుదలకు 10 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ సినిమా టిక్కెట్లన్నీ ఓవర్సీస్ లో అమ్ముడుపోయాయి. అలా రికార్డు ఓపెనింగ్స్ రాబట్టుకున్న దేవదాస్.. రీసెంట్ గా హాఫ్ మిలియన్ మార్క్ అందుకున్నాడు. దాదాపు 180కి పైగా లొకేషన్లలో విడుదలైన దేవదాస్ సినిమా 5లక్షల 44వేల డాలర్లు కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్ లో కంప్లీట్ పాజిటివ్ టాక్ తో నడుస్తోంది దేవదాస్. మరీ ముఖ్యంగా నాని, నాగ్ ఆన్ స్క్రీన్ ఎప్పీయరెన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇదే ఊపులో మరో 3 రోజుల్లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం గ్యారెంటీ.

శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కింది దేవదాస్ చిత్రం. రష్మిక, ఆకాంక్ష ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను “ఫ్లై-హై సినిమాస్” అనే సంస్థ రిలీజ్ చేసింది.