అన్నింటి కన్నా సినిమా గొప్పది – NTR

Friday,October 26,2018 - 07:25 by Z_CLU

దసరా సీజన్ కి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచింది అరవింద సమేత. రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లో కాకుండా కథను కథగా చెప్పగలిగాం కాబట్టే సినిమా ఇంతమందికి రీచ్ అయింది అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సందర్భంగా సినిమాలోని క్యారెక్టర్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అన్నింటి కన్నా సినిమానే గొప్పది అని చెప్పుకున్నాడు NTR.

“బసిరెడ్డి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టే నా క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే అవకాశం దక్కింది. సినిమాలో నా  క్యారెక్టర్ గొప్పగా ఉందా..? ఇంకెవరి క్యారెక్టర్ అయినా గొప్పగా ఉందా అనే ఆలోచన నాకెప్పుడూ రాదు. అన్ని వైపుల నుండి సహకారం దొరికినప్పుడే ఒక గొప్ప చిత్రం తెరకెక్కుతుంది. అలా జరిగింది కాబట్టే అరవింద్ సమేతకి ఇంత ఆదరణ దక్కుతుంది. అన్నింటి కన్నా గొప్పది సినిమానే”. అని చెప్పుకున్నాడు NTR.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.