NTR అరవింద సమేత BGM జ్యూక్ బాక్స్

Monday,October 22,2018 - 06:31 by Z_CLU

NTR ‘అరవింద సమేత’ BGM జ్యూక్ బాక్స్ రిలీజయింది. సినిమాలోని ప్రతి ఇమోషన్ ని అంతే గ్రాండియర్ గా ఎలివేట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని మరింతగా మెస్మరైజ్ చేస్తుంది.

సినిమాలోని 15 మోస్ట్ ఇంటెన్సివ్ సిచ్యువేషన్స్ లో కీ రోల్ ప్లే చేసింది ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్. దాంతో పాటు సినిమాలో చివరన ఉండే ‘రెడ్డమ్మ తల్లి’ సాంగ్ మూవీ వర్షన్ ని కూడా ఈ జ్యూక్ బాక్స్ లో ఆడ్ చేశారు మేకర్స్. పెంచల్ దాస్ లిరిక్స్ రాసిన ఈ పాటని మోహన భోగరాజు పాడారు.

 

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ వరస వసూళ్లతో, బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్.