జీవితంలో మర్చిపోలేని సినిమా – NTR

Monday,October 22,2018 - 12:54 by Z_CLU

నిన్న గ్రాండ్ గా జరిగింది NTR అరవింద సమేత సక్సెస్ మీట్. ఈ వేడుకలో అరవింద సమేత కంప్లీట్ టీమ్ పార్టిసిపేట్ చేసింది. దానికి తోడు ఈ బాలయ్య కూడా ఈ ఈవెంట్ కి రావడంతో ఒకే వేదికపై NTR, బాలయ్య, కళ్యాణ్ రామ్ లను ఒకేసారి చూసుకునే అరుదైన అవకాశం ఫ్యాన్స్ కి దక్కింది. ఈ సందర్భంగా ఇంత బిజీ షెడ్యూల్స్ లోను ఈ ఈవెంట్ కోసం సమయం కేటాయించిన బాలయ్యకు థాంక్స్ చెప్పుకున్న NTR, అరవింద సమేత గురించి కూడా మాట్లాడాడు.

“రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ విషాద చాయాల్లో ఉన్న మా కుటుంబానికి ఇంత మంచి సినిమానిచ్చిన త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద థాంక్స్. జీవితంలో మరచిపోని సినిమానిచ్చారు” అని చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా సినిమాకి పని చేసిన తక్కిన స్టార్ కాస్ట్ తో పాటు, టెక్నీషియన్స్ కి కూడా థాంక్స్ చెప్పుకున్నాడు NTR.

దసరాకి పర్ఫెక్ట్ ట్రీట్ గా తెరకెక్కిన ఈ సినిమా అటు క్లాస్, మాస్, యూత్ అని తేడా లేకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది.