‘అరవిందసమేత’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
Friday,January 11,2019 - 10:02 by Z_CLU
ఈ సంక్రాంతి సీజన్ మరింత స్పెషల్ కానుంది. ఈ ఏడాది పండగ సంబరాలలో మరింత జోష్ నింపనుంది ‘అరవింద సమేత’. రీసెంట్ గా రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘జీ తెలుగు’ లో టెలీకాస్ట్ కానుంది.
ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్, NTR కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కి ఏ రేంజ్ లో అప్లాజ్ వచ్చిందో, ఇమోషనల్ సీక్వెన్సెస్ కి కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సినిమా బిగినింగ్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిన దర్శకుడు త్రివిక్రమ్, ఆ ఒక్క ఫైట్ సీక్వెన్స్ చుట్టూ సినిమా అంతటా అల్లిన ఇమోషనల్ కనెక్టివిటీ, సినిమాని బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకువెళ్ళింది.
ఒక కథని రాసుకుని అ కథలో అడుగడుగునా రాయలసీమ సొగసును ప్రెజెంట్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. ఆ సొగసుకు NTR లాంటి స్టార్ హీరో జతవ్వడంతో ‘అరవింద సమేత’ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా అనిపించుకుంది. సిల్వర్ స్క్రీన్ పై కలెక్షన్ ల వర్షం కురిపించిన ఈ సినిమా ఈ ఆదివారం 5:30 లకు, ‘జీ తెలుగు’ తో పాటు ‘జీ తెలుగు HD’ ఛానల్స్ లో టెలీకాస్ట్ అవుతుంది చూసి ఆనందించండి.