విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ నుండి ఫస్ట్ సింగిల్

Friday,October 26,2018 - 05:32 by Z_CLU

నవంబర్ 16 న గ్రాండ్ గా రిలీజవుతుంది విజయ్ దేవరకొండ టాక్సీవాలా. ఈ లోపు ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన ఫిల్మ్ మేకర్స్ ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

‘మాటే వినదుగా…పెరిగే వేగమే… తగిలే మేఘమే అంటూ..’ సాగే లిరిక్స్, ఫస్ట్ టైమ్ ఈ పాట విన్న వాళ్ళు కూడా ఈజీగా ట్యూన్ తో పాటు ట్రావెల్ అయ్యేంతలా మెస్మరైజ్ చేస్తున్నాయి. మరీ రొటీన్ మెలోడీలా కాకుండా, డిఫెరెంట్ కంపోజిషన్ తో ఈ సాంగ్ ని ప్రెజెంట్ చేసిన జేక్స్ బిజాయ్ ఫస్ట్ సాంగ్ తోనే సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేటట్టు చేశాడు. కృష్ణకాంత్ ఈ పాటకి లిరిక్స్ రాశాడు.

సినిమాలో సరిగ్గా ఏ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ ఉండబోతుందో గెస్ చేయడం కష్టమే కానీ, ఈ లిరికల్ వీడియోతో పాటు రిలీజైన స్టిల్స్, సాంగ్స్ విజువల్స్ పై కూడా అంచనాలు పెంచేశాయి.

విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ సంక్రిత్యాన్ ఈ సినిమాకి డైరెక్టర్. UV క్రియేషన్స్, GA2 పిక్చర్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమాకి SKN ప్రొడ్యూసర్.