అరవింద కోసం జగ్గూభాయ్ పడ్డ కష్టం

Friday,October 12,2018 - 12:06 by Z_CLU

నిన్న రిలీజయింది అరవింద సమేత. NTR ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ దసరా ట్రీట్ అనిపించుకుంటుంది ఈ సినిమా. మరీ ముఖ్యంగా జగపతి బాబు లుక్స్, డిక్షన్, పర్ఫామెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే, జగ్గూబాయ్ కరియర్ లో ఈ షేడ్స్ లో ఎప్పుడూ చూడలేదు అంటున్నారు ఫ్యాన్స్. అయితే సినిమాపై ఈ రేంజ్ ఇంపాక్ట్ పడేటట్టు చేయడానికి జగ్గూభాయ్ చాలా కష్టపడ్డాడు.

రాయలసీమ యాసలో మాట్లాడటం ఒక ఎత్తైతే, ఈ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు బొంగురు గొంతు ఎఫెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడట. వోకల్ కార్డ్స్ పై ఒత్తిడి పడి ఒక్కోసారి చాలా సేపటి వరకు దగ్గుతూనే ఉండిపోయేవాడట జగపతి బాబు. ఒకసారైతే గొంతుపై మరీ స్ట్రెస్ ఎక్కువై దగ్గేటప్పుడు రక్తం కూడా వచ్చిందట. ఒక డిస్కర్షన్ లో ఈ విషయాన్ని కన్ఫమ్  చేశాడు దర్శకుడు త్రివిక్రమ్.

ఈ రోజు అరవింద సమేతకి వరల్డ్ వైడ్ గా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే అది డెఫ్ఫినేట్ గా టీమ్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పెట్టిన ఎఫర్టే రీజన్. పాజిటివ్ టాక్ తో బిగిన్ అయిన అరవింద జర్నీ బ్లాక్ బస్టర్ దిశగా మూవ్ అవుతుంది. రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అరవింద సమేత.