స్టార్స్ 'న్యూ ఇయర్' సెలెబ్రేషన్స్

Wednesday,December 28,2016 - 03:30 by Z_CLU

2016 కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఫాస్ట్ ఫాస్ట్ గా దూసుకొస్తున్న న్యూ ఇయర్ గ్రాండ్ సెలెబ్రేషన్స్ ని తీసుకొస్తుంది. అందుకే బిజీ షెడ్యూల్స్ తో బిజీగా బిజీగా ఉన్న స్టార్స్ కూడా న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ప్రతి ఈవెంట్ ని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకునే మన స్టార్స్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం వారి వారి ఫేవరేట్ డెస్టినేషన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు.

 

pawan-1

‘కాటమరాయుడు’ సినిమాతో బిజీగా ఉన్న పవర్ స్టార్ కూడా న్యూ ఇయర్ అకేషన్ కోసం గ్రాండ్ గా ప్లాన్  చేసుకున్నాడు. ఈ న్యూ ఇయర్ కి  తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు పవర్ స్టార్.

mahesh-babu-final

తన ప్రతి సినిమా తరవాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసుకునే మహేష్ బాబు, ఇంత బిజీ షెడ్యూల్స్ లోను, న్యూ ఇయర్ వెకేషన్ కోసం గ్యాప్ చేసుకున్నాడు. ఫ్యామిలీ తో గడిపే ఏ అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోని మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలిసి న్యూయార్క్  లో న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకోబోతున్నాడు .

 

ram-charan

బ్యాక్ టు బ్యాక్ బిజీ షెడ్యూల్స్ తో తెరకెక్కిన ‘ధృవ’ సూపర్ సక్సెస్ తో హ్యాప్పీగా ఉన్న చెర్రీ, న్యూ ఇయర్ సెలెబ్రేషన్ ని ఇంకా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే మూడ్ లో ఉన్నాడు. అందుకే తన మోస్ట్ ఫేవరేట్ డెస్టినేషన్… తన ఇంట్లోనే, ఉపాసనతో కలిసి న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్ కం చెప్పనున్నాడు.

nani

‘నేను లోకల్’ సినిమాతో బిజీగా ఉన్న నాని తన వైఫ్ తో కలిసి థాయిలాండ్ లో న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. అందుకే మినిమం వన్ వీక్ సెట్స్ పైకి వచ్చే సవ్వాల్ లేదని చెప్పేశాడట మన జెంటిల్ మెన్.

brahmaji

అంతెందుకు అడపా దడపా సినిమాలతో బిజీగా ఉండే బ్రహ్మాజీ కూడా ఈ 2017 కి వెల్ కం చెప్పడానికి ఫ్యామిలీతో కలిసి U.S. కి వెళ్తున్నాడు.

akshay-kumar

మన టాలీవుడే కాదు బాలీవుడ్ కూడా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ తో బిజీగానే ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఫ్యామిలీతో కలిసి సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో న్యూ ఇయర్ హాలీడేస్ ని ప్లాన్ చేశాడు.

hrithik

నిన్న మొన్నటి వరకు ‘కాబిల్’ సినిమా షూటింగ్ , ప్రమోషన్స్ అని బిజీగా ఉన్న హృతిక్ కూడా న్యూ ఇయర్ ని ఫ్రాన్స్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.

www.hdfinewallpapers.com

 

ఇక అజయ్ దేవ్ గన్ కూడా తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో న్యూ ఇయర్ వెకేషన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు.

ranveer-deepika

మామూలుగానే దొరికిన అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోరు, అందునా న్యూ ఇయర్ లాంటి గ్రాండ్ అకేషన్ దొరికితే ఎందుకు వదులుతారు…? బాలీవుడ్ క్రేజీ కపుల్ రణవీర్-దీపికా కూడా ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు… దానికోసం దుబాయ్ కి వెళ్ళి మరీ 2017 కి గ్రాండ్ గా వెల్ కం చెప్తున్నారు.

virat-anushka

 

ఇక హాలీడే సెలెబ్రేషన్స్ అంటే తెగ ఇష్టపడే లవ్ బర్డ్స్ అనుష్క, విరాట్ కోహ్లీ, ఆల్ రెడీ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేసేశారు. ప్రస్తుతం డెహ్రాడూన్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్క అక్కడి నుండి ఎక్కడికి వెళతారో చూడాలి.

tapsee

ఇక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉన్న తాప్సీ, 2017 కి వెల్ కం చెప్పడం ఎంత అవసరమో, 2016 కి పెద్ద థాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా అంతే ఉంది. అందుకే ఇయర్ ఎండ్ సెలెబ్రేషన్స్ కోసం, ఎప్పుడూ తన వెంటే ఉండే సిస్టర్స్, ఫ్రెండ్స్ తో సింగపూర్ లో వెకేషన్స్ ని ప్లాన్ చేసుకుంది తాప్సీ.

yami-gautham-at-event-photos-_2_

ఇప్పటిదాకా ఇటు హృతిక్ రోషన్ ‘కాబిల్’ సినిమాతో, మరో వైపు రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్’ సీక్వెల్ తో బిజీగా ఉన్న యామీ గౌతమ్ న్యూ ఇయర్ వెకేషన్ ని దాదాపు నెల క్రితమే ఫిక్స్ చేసుకుంది. ఇన్నాళ్ళు బిజీ షెడ్యూల్స్ తో ఇంటికి దూరంగా ఉన్న యామీ, ఈ సారి చండీగఢ్ లో తన ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఆలోచనలో ఉంది.