Sankranthi Movies టాలీవుడ్ Vs కోలీవుడ్

Wednesday,November 09,2022 - 04:50 by Z_CLU

సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ప్రతీ ఏడాదిలాగే వచ్చే ఏడాది కూడా బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. అయితే ఈసారి చిరు , బాలయ్య మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే పలు సార్లు సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ ఇద్దరు మరో సారి బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నారు. చిరు ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) తో సంక్రాంతికి రానుండగా బాలయ్య ‘వీరసింహారెడ్డి’ (Veerasimhareddy) తో రాబోతున్నాడు.

ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇరువురి అభిమానుల్లో సినిమాలపై భారీ అంచనాలున్నాయి. రెండూ మాస్ యాక్షన్ సినిమాలే కావడంతో ఈసారి సంక్రాంతి పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారా ? అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.  ఈసారి కేవలం టాలీవుడ్ పోటీనే కాదు. కోలీవుడ్ బడా సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి.

అజిత్ హీరోగా హెచ్. వినోద్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తునివు’ (Thunivu) తో పాటు  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న ‘వారసుడు’ (Varisu) కూడా పొంగల్ పోటీలో నిలిచింది. ఈ రెండు సినిమాలు కోలీవుడ్ లో మంచి వైబ్ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగులో అజిత్ సినిమా కంటే విజయ్ సినిమాపై ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటం , దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో వారసుడు కి తెలుగులో థియేటర్స్ కూడా ఎక్కువ దొరికే అవకాశం కనిపిస్తుంది.

అయితే అప్పుడప్పుడు తెలుగులో సంక్రాంతి సీజన్ లో తమిళ్ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవ్వడం కామనే. కాకపోతే ఈసారి అజిత్ , విజయ్ ఇద్దరూ ఇక్కడ పోటీ పడబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఏదేమైనా వచ్చే సంక్రాంతి కి తెలుగు బడా సినిమాలు వర్సెస్ తమిళ్ బడా డబ్బింగ్ సినిమాల పోటీ ఉండనుంది. మరి చిరు -బాలయ్య తో పాటు పోటీ పడుతున్న అజిత్ , విజయ్ లలో ఎవరు గెలుస్తారో చూడాలి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics