Super Star Krishna ఒక శకం ముగిసింది

Wednesday,November 16,2022 - 04:27 by Z_CLU

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గుండెపోటు తో మొన్న అర్థరాత్రి ఓ ప్రయివేటు హాస్పిటల్ లో చేరడం కొన్ని గంటలకే తుది శ్వాస విడవడం తెలిసిందే. నిన్నటి నుండి సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు కృష్ణ గారి శ్రద్దాంజలి ఘటిస్తూ మహేష్ కుటుంబాన్ని పరామర్శిస్తూనే ఉన్నారు. ఉదయం నుండి పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ గారి పార్ధీవ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. కడసారి తమ అభిమాన హీరోను చూసేందుకు జనాలు పోటేత్తారు. ఫిలింనగర్ మహా ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్య క్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఇక సెలవు అంటూ సూపర్ స్టార్ కనుమరగయ్యారు.

ఎన్టీఆర్ , ఏఎన్నార్, శోభన్ బాబు , కృష్ణం రాజు , కృష్ణ తో ఆ తరం నటుల శకం ముగిసింది. ఇటివలే కృష్ణం రాజు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా కృష్ణ కూడా గుండెపోటుతో మరణించారు. కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ చరిత్ర ముగిసిపోయింది. ఆ తరం లెజండరీ కథానాయకులు ఇప్పుడు భౌతికంగా లేకపోయినా వారు చేసిన క్లాసిక్ సినిమాల రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు. చెరగని ఓ జ్ఞాపకంలా మిగిలిపోతారు. ప్రస్తుతం అభిమానులకు తమ వారసులను అందించి వారు తిరిగి రాని అనంత లోకాలకు వెళ్ళిపోయారు.

తండ్రి మరణంతో మహేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఏదాది లోపే మహేష్ తన జీవితం ఎంతో ముఖ్యమైన ముగ్గిరిని కోల్పోవడం బాధాకరం. మహేష్ తన తండ్రి మరణం నుండి త్వరగా కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్ తో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics