వినాయక్ పరిస్థితేంటి?

Wednesday,December 28,2016 - 04:40 by Z_CLU

ప్రతి ఏడాది ఓ సినిమాతో ఎంటర్టైన్ చేసే స్టార్ డైరెక్టర్ వినాయక్ ఈ ఏడాది మాత్రం మిస్ అయ్యాడు. 2015 లో ‘అఖిల్’ సినిమా తో థియేటర్స్ లో అడుగు పెట్టిన వినాయక్ ఈ ఇయర్ ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి స్పెషల్ రీజన్ ఉంది. ఈ ఏడాది వినాయక్ కు పిలిచి మరీ తన 150 సినిమాను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు మెగా స్టార్. అందుకే తన కాలెండర్ లో నుంచి ఓ ఏడాది ని చిరు కోసం డేడికేట్ చేసేసాడు ఈ స్టార్ డైరెక్టర్.

    మరి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా షూటింగ్ పూర్తి అయి రిలీజ్ కి రెడీ అవుతుండడం తో వినాయక్ నెక్స్ట్ సినిమా ఏమిటా ? అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. నెక్స్ట్ ఇయర్ స్టార్ హీరోలందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా ఉండడం తో తన నెక్స్ట్ సినిమాను ఏ హీరో తో చెయ్యాలా? అనే డైలమాలో పడ్డాడట వినాయక్. మరి ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ తర్వాత ఏ స్టార్ హీరో అయినా తన లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ ను పక్కన పెట్టి వినాయక్ తో సినిమా చేస్తారేమో? చూడాలి..