రామ్ చరణ్ సూపర్ పోలీస్ రిలీజ్ కి రెడీ

Wednesday,December 28,2016 - 02:30 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ సినిమా తమిళ్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హిందీతో పాటు తెలుగులోనూ ‘తుఫాన్’ గా రిలీజైన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేసింది. ఇప్పుడీ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని తమిళంలో ‘సూపర్ పోలీస్’ గా రిలీజ్ కానుంది.

అపూర్వ లాఖియా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్  పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ లోను సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.