హిందీలో బన్నీ హంగామా

Saturday,April 29,2017 - 05:00 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ ఓ యాడ్ తో సోషల్ మీడియా తో పాటు హిందీ చానెల్స్ లో కూడా హంగామా చేస్తున్నాడు.. ఇప్పటికే కొన్ని ప్రయివేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా హంగామా చేసిన బన్నీ లేటెస్ట్ గా మరో సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు..రెడ్ బస్ అనే టికెట్ బుకింగ్ సంస్థ ప్రెజెంట్ బన్నీ ను దేశం మొత్తానికి బ్రాండ్ ప్రచార కర్తగా నియమించుకుంది..

లేటెస్ట్ గా బన్నీ పై ఓ యాడ్ కూడా షూట్ చేసిన ఈ సంస్థ ఈ యాడ్ ను ముందుగా హిందీ లో రిలీజ్ చేసింది.. బస్ లో ఓ సీట్ లో ప్రశాంతంగా కూర్చున్న రాజు ను ఆ సెట్ లో నుంచి లేపేసి వెనక్కి పంపించి రెడ్ బస్ లో టికెట్ బుక్ చేసుకున్నవాడే రాజు అంటూ వచ్చే ఈ యాడ్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో అలాగే హిందీ ఛానల్ లో సందడి చేస్తుంది..

త్వరలోనే అన్ని భాషల్లో ఈ యాడ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ సంస్థ.. సో సినిమాలతోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బన్నీ క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు..