'స్పైడర్' అప్డేట్స్ ...

Saturday,April 29,2017 - 03:10 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ ‘స్పైడర్’.. మొన్నటి వరకూ టైటిల్ అనౌన్స్ చేయకుండా ఫాన్స్ ని ఊరించిన ఈ సినిమా ఎట్టకేలకి స్పైడర్ అనే టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే చెన్నై లో ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా మే 2 నుంచి క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుపుకోనుంది..ఇప్పటికి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 2 నుంచి మే చివరి వరకూ జరగనున్న షెడ్యూల్ తో పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి కానుందట..

లేటెస్ట్ గా చెన్నై పరిసరాల్లో మహేష్ – రకుల్ -ఎస్ జె సూర్య మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన యూనిట్ త్వరలోనే క్లైమాక్స్ పార్ట్ తో పాటు మరి కొన్ని కీలకమైన సీన్స్ ను చిత్రీకరించనున్నారట.. మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 23 న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రెసెంట్ ఆ డేట్ ను ఆగస్టు 9 కి పోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం.. ప్రెజెంట్ షూటింగ్ ఇంకా బాలన్స్ ఉండడటం, పోస్ట్ ప్రొడక్షన్ కి బాగా టైం పడుతుండడం తో మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9 న సినిమాను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్..