బన్నీ-దిల్ రాజు హ్యాట్రిక్ హిట్

Saturday,June 24,2017 - 02:02 by Z_CLU

హిట్ కాంబినేషన్లు కలిస్తే ఆటోమేటిగ్గా మరో సూపర్ హిట్ గ్యారెంటీ. డీజే విషయంలో కూడా అదే జరిగింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిసి చేసిన డీజే సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ.

ఫస్ట్ టైం ఆర్య సినిమాతో కలిశారు బన్నీ-దిల్ రాజు. ఆర్య సినిమా బన్నీకి రెండోది కాగా, నిర్మాతగా దిల్ రాజుకు  కూడా ఇది రెండో సినిమానే. అలా రెండో ప్రయత్నంగా వీళ్లిద్దరూ కలిసి ఆర్యతో బ్లాక్ బస్టర్ కొట్టారు. తర్వాత ప్రయత్నంగా పరుగు సినిమాతో మరో విజయం అందుకున్నారు.

ఆర్య, పరుగు విజయాల తర్వాత హ్యాట్రిక్ కొట్టడానికి ఇన్నేళ్లు పట్టింది. ముచ్చటగా మూడోసారి బన్నీ, దిల్ రాజు కలిసి చేసిన ప్రయత్నమే డీజే. హరీష్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి హిట్ టాక్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ అందరికీ బాగా నచ్చాయి.