హీరోలు రెడీ...కథలు మాత్రం లేవు

Wednesday,October 10,2018 - 04:04 by Z_CLU

పవన్ తో ఇక సినిమా ఉండకపోవచ్చు.

మహేష్ బాబుతో సినిమా సెట్ అవ్వడం లేదండి.

బన్నీతో ఓ సినిమా చేయాలి. కానీ ఇద్దరికీ లావు అనిపించే కథ దొరకడం లేదు.

వెంకటేష్ తో సినిమా ఉంది, కథ లేదు.

తన అప్ కమింగ్ మూవీస్ పై త్రివిక్రమ్ రెస్పాన్స్ ఇది. హీరోలంతా రెడీగా ఉన్నారు కానీ కథలు మాత్రం లేవంటున్నాడు ఈ దర్శకుడు. రాత్రికి ఓ స్టోరీ అనుకొని, లైన్ రాసుకొని పడుకుంటే.. పొద్దున్న లేచి చూస్తే నచ్చడం లేదంటున్నాడు.

 

“పదేళ్ల నుంచి నేను, పవన్ ఒకేలా ఉన్నాం. నిజానికి మేమిద్దరం బయట సినిమాల గురించి మాట్లాడుకోం. ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తుంటాను. సినిమా మాత్రం ఉండకపోవచ్చు. నేను ఏదో పనిచేస్తున్నాను. ఆయన ఇంకేదో పని చేస్తున్నారు.”

 

“మహేష్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఎన్టీఆర్ లానే అది కూడా. ఎప్పట్నుంచో అనుకుంటే ఇప్పుడు సెట్ అయింది. మహేష్ కు, నాకు ఇద్దరికీ చేయాలని ఉంది. కానీ సెట్ అవ్వడం లేదు. చూడాలి.”

 

“బన్నీతో సినిమా ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఇద్దరికీ లావు అనిపించే కథ దొరకడం లేదు.”

 

“వెంకటేష్ తో సినిమా ఓకే అయింది. కానీ సరైన కథ సెట్ అవ్వడం లేదు. ఇద్దరికీ నచ్చే కథ కోసం ప్రయత్నిస్తున్నాను.”