సెట్స్ పైకొచ్చిన బన్నీ-త్రివిక్రమ్ మూవీ

Wednesday,April 24,2019 - 01:21 by Z_CLU

సరిగ్గా ఏడాది గ్యాప్ తర్వాత సెట్స్ పైకొచ్చాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. హైదరాబాద్ లోనే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.

ఇకపై ఏకథాటిగా ఈ సినిమా షూటింగ్ కొనసాగించాలని టీమ్ నిర్ణయించింది. సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఆమె షూట్ లో జాయిన్ అవుతుంది. మరో కీలకపాత్ర కోసం ఒకప్పటి హీరోయిన్ టబును తీసుకున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో సత్యరాజ్, జయరాం కనిపించనున్నారు.

హారిక-హాసిని, గీతాఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఇప్పటికే ఈ సినిమాకు పాటలిచ్చే పని స్టార్ట్ చేశాడు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రెడీ చేయాలని చూస్తున్నారు. సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు.