బన్నీ నెక్స్ట్ ... అనౌన్స్ మెంట్ అప్పుడే

Sunday,October 14,2018 - 02:22 by Z_CLU

గత కొన్ని నెలలుగా తన నెక్స్ట్ సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు అల్లు అర్జున్ .. నిన్నటి వరకూ బన్నీ డైరెక్టర్ లిస్టు లో  విక్రం కుమార్ తో పాటు తమిళ దర్శకుడు శివ పేర్లు వినిపించగా ఇప్పుడు త్రివిక్రమ్ పేరు లిస్టు లో చేరింది.  బన్నీ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందనే ఇప్పటికే ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ న్యూస్ పై బన్నీ అండ్ టీం నుండి  ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ఈ ముగ్గురిలో బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా… అనే ప్రశ్న అందరిలో నెలకుంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ నెక్స్ట్ సినిమాకు సంబంధించి విజయదశమి రోజు ఓ అనౌన్స్ మెంట్ రానుందని ఆరోజే తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గురించి బన్నీ క్లారిటీ ఇస్తాడని తెలుస్తుంది.