స్పీడ్ పెంచబోతున్న బన్నీ

Sunday,April 14,2019 - 12:05 by Z_CLU

‘నా పేరు సూర్య’ తర్వాత కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్న సినిమాను ఈ నెల 24 నుండి సెట్స్ పైకి తీసుకురాబోతున్న స్టైలిష్ స్టార్ ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకూ ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా ఓ కొలిక్కి రాగానే సుకుమార్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ వెంటనే వేణు శ్రీరాంతో చేయబోయే ‘ఐకాన్’ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు.

ఈ మూడు సినిమాల తర్వాత మురుగదాస్ తో తమిళ్ , తెలుగులో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే బన్నీ-మురుగదాస్  మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా డైరెక్టర్స్ ని ఫిక్స్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని భావిస్తున్నాడు స్టైలిష్ స్టార్.