పంచెకట్టులో సమంతా

Wednesday,May 03,2017 - 05:21 by Z_CLU

లేటెస్ట్ గా పంచెకట్టులో ఉన్న సమాంత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రావు రమేష్ పక్కన పంచెకట్టు గెటప్ లో ఉన్న స్టిల్ ఓ వైపు ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే, మరో వైపు మిలియన్ డాలర్ క్వశ్చన్ ని రేజ్ చేసింది. పంచెకట్టు సరే… కానీ ఈ గెటప్ ఏ సినిమాలోది..? ఏ క్వశ్చన్ కి ఎక్కడా ఆన్సర్ దొరకడం లేదు.

ప్రస్తుతం సమంతా అకౌంట్ లో మూడు సినిమాలున్నాయి. మహానటి సావిత్రి బయోపిక్ తో పాటు, రాజుగారి 2, రామ్ చరణ్ సుకుమార్ సినిమా. ఈ మూడు సినిమాల్లో నుండి ఈ స్టిల్ ఏ సినిమాకి సంబంధించి ఉంటుందా.? అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు స్యామ్ ఫ్యాన్స్ లో సర్క్యులేట్ అవుతుంది.

మహానటి సావిత్రి బయోపిక్ ఇంకా సెట్స్ పైకి రాలేదు కాబట్టి, కంపల్సరీగా ఈ స్టిల్ రాజు గారి గది 2 సినిమాదే అయి ఉటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోపక్క రామ్ చరణ్ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది కాబట్టి డెఫ్ఫినేట్ గా ఆ సినిమాకి సంబంధించినదే అయి ఉంటుందని మరికొంత మంది ఫీలింగ్.  ఏది ఏమైనా రావు రమేష్ తో అడోరబుల్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న సమంతా పంచెకట్టు స్టిల్, సమంతా ఫ్యాన్స్ ని మాత్రం ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసేస్తుంది.