భరత్ అనే నేను ప్రొడ్యూసర్ D.V.V. దానయ్య ఇంటర్వ్యూ

Tuesday,April 17,2018 - 02:13 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఈ నెల 20 న గ్రాండ్ గా రిలీజవుతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా  టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఈ సినిమా నిర్మాత D.V.V. దానయ్య సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్ చాట్ మీ కోసం…

సక్సెస్ ఫుల్ గా 25 ఏళ్ళు…  

నిర్మాతగా  నా  జర్నీ 1992 లో రిలీజైన ‘జంబ లకిడి పంబ’ తో బిగిన్ అయింది. ఈ జర్నీలో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాను, ఆవరేజ్ సినిమాలు కూడా చేశాను. నిర్మాతగా ఈ ప్రయాణంలో సహకరించిన మీడియాకి చాలా థాంక్స్.

బ్యానర్ గర్వించే సినిమా…

నిన్ననే సెన్సార్ క్లియర్ అయింది సినిమా. D.V.V. బ్యానర్ గర్వించే సినిమా అవుతుంది భరత్ అనే నేను. ఈ విషయంలో కొరటాల శివ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

చాన్నాళ్ళ కోరిక తీరింది…

మహేష్ బాబు వెనకాల చాలా రోజుల నుండి పడుతున్నాను. మా బ్యానర్ లో సినిమా చేయండి అని. అది ఇప్పుడు.. ఈ సినిమా ద్వారా తీరినందుకు చాలా ఆనందంగా ఉంది.

అదే రీజన్…

మాది వెస్ట్ గోదావరి జిల్లా.  నా చిన్నప్పుడు మా ఊళ్ళో చాలా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. అందాల రాముడు, సిరిసిరి మువ్వ, భక్త కన్నప్ప, శారద, హిమ్మత్ వాలా, కృష్ణ గారి ‘పాడి పంటలు’… ఇలా చాలా సినిమాలు షూటింగ్ జరిగేవి.. అలా సినిమా షూటింగ్స్ చూసి ఇన్స్ పైర్ అయి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అదృష్టవశాత్తు నిర్మాతనయ్యాను….

అలా మొదలైంది…

‘జంబలకిడి పంబ’ కి ముందు ఇ.వి.వి. సత్యనారాయణ డైరెక్షన్ చేయాలనుకోవడం, ఆ సినిమాకి నేను, ఇ. వి.వి.,  భగవాన్ అందరం పార్ట్ నర్స్ గా ఉండి సినిమా చేయడం జరిగింది. నిర్మాతగా నా ప్రయాణం అలా మొదలైంది…

 

ఏ పార్టీకి రిలేటెడ్ కాదు…

ఈ సినిమాలో మహేష్ బాబు మంచి CM అంతే. ఏ పార్టీని హైలెట్ చేస్తూ కానీ, ఇంకేదో పార్టీని క్రిటిసైజ్ చేస్తూ సినిమా ఉండదు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా భరత్ అనే నేను.

అసెంబ్లీ – వచ్చాడయ్యో సామీ

సినిమా మొత్తం అసెంబ్లీ లో ఉండదు కానీ హీరో CM కాబట్టి అసెంబ్లీ రిచ్ గా ఉండాలి అనుకున్నాం. అందుకే 2 కోట్లు పెట్టి అసెంబ్లీ సెట్ వేశాం. ఇక ‘వచ్చాడయ్యో సామీ కోసం’.. ముందు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం,  టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే సాంగ్ అదీ.. ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా 4 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆ సినిమాను తెరకెక్కించాం.

అంతకు మించి…

సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఆడియెన్స్ లో కూడా సినిమా పట్ల భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. సినిమా కూడా అదే విధంగా అద్భుతంగా ఉంటుంది, అనుమానమే లేదు…

 

మహేష్ బాబు అందుకే స్పెషల్…

నేను చాలా మంది స్టార్స్ తో పని చేశాను కానీ మహేష్ బాబు కొంచెం స్పెషల్. ఆయన ప్రతి రోజు  సెట్స్  పైకి  వచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా అవ్వుతూ ఉంటాడో, వెళ్ళేటప్పుడు కూడా ఆలాగే నవ్వుతూ ఉంటాడు.. నాకే కాదు ఎవరికైనా ఆయనతో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది…

కైరా అద్వానీ…

చాలా మంచి అమ్మాయి. ఈ సినిమా తరవాత ఆ అమ్మాయికి బ్యాక్  టు బ్యాక్ ఆఫర్స్ రావడం ఖాయం. సెట్స్ లో ఏ మాత్రం నార్త్ ఇండియన్ లా కాకుండా, తెలుగమ్మాయే అనిపిస్తుంది…  సినిమాలో చాలా బాగా నటించింది.

నో కాంట్రవర్సీ…

కొరటాల శివ కాంట్రవర్సీ సినిమాలు చేయడు. సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం, సినిమా సెట్స్ పైకి రాకముందే కొందరిని సంప్రదించి ఈ సీన్ ఇలా ఉంటే, ఏమైనా ఇబ్బందా అని కనుక్కుని మరీ సినిమా తీశాడు.

సినిమా లెంత్…

సినిమా  నిడివి 2: 50 నిమిషాలు . ఈ సినిమా లెంత్ విషయంలో అసలు మాకు ఆలోచనే లేదు. ఎంత సేపైనా ఆడియెన్స్ ని కూర్చోబెట్టేయాలి. అలాంటి సన్నివేశాలు ఉండాలి, ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే లెంత్ గురించి మేం ఆలోచించడం లేదు.

రామ్ చరణ్ – బోయపాటి

చెర్రీ- బోయపాటి సినిమా ఆల్రెడీ 2 షెడ్యూల్ కంప్లీట్ అయ్యాయి. ఈ నెల 21 నుండి రామ్ చరణ్ సెట్స్ పైకి వస్తాడు.

రాజమౌళి తో సినిమా…

రాజమౌళి తో సినిమా ఎగ్జాక్ట్ గా మంత్ చెప్పలేను కానీ  ఈ ఇయర్ కంపల్సరీగా సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది.