బెస్ట్ డెబ్యూ సింగర్

Thursday,May 18,2017 - 05:15 by Z_CLU

మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెస్ట్ డెబ్యూ సింగర్ గా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ ఇప్పటికే పాటలు పాడారు. తెలుగులో డెబ్యూ మాట అటుంచి సింగింగ్ లో సీనియర్ అయిపోయాడు. అయితే ఈ డెబ్యూ అనేది శాండిల్ వుడ్ కు సంబంధించిన మేటర్. ఈ అవార్డు కూడా అక్కడ్నుంచి వచ్చిందే.

చక్రవ్యూహ అనే కన్నడ సినిమాలో పాట పాడాడు యంగ్ టైగర్. ఇందులో పునీత్ రాజ్ కుమార్ హీరో. వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే పునీత్ అడిగిన వెంటనే పాట పాడాడు ఎన్టీఆర్. ఆ పాట కన్నడనాట పెద్ద హిట్ అయింది. ఎంత హిట్ అంటే.. దాదాపు నెల రోజుల పాటు చార్ట్ బస్టర్స్ లో ఇదే నిలిచింది. ఇప్పుడు ఇదే పాటతో శాండిల్ వుడ్ డెబ్యూ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికయ్యాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం ఈ హీరో జై లవకుశ సినిమా చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్నా, నివేద ధామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.