పాకిస్తాన్ లో బాహుబలి 2

Thursday,May 18,2017 - 05:35 by Z_CLU

బాహుబలి 2 పాకిస్తాన్ లోను తిరుగు లేదనిపించుకుంటుంది. అసలు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా క్లియర్ అవుతుందో లేదో అనే డైలామాలో ఉండగానే సినిమా రిలీజ్ అయి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటుంది.

ఇప్పటికే 4.50 కోట్లు వసూలు చేసిన బాహుబలి 100 స్క్రీన్స్ లో రిలీజయింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ లో జస్ట్ ఖాన్ సినిమాలకే క్రేజ్ ఉంటుందనే టాక్ ఉండేది. అలాంటి బ్యారియర్ ని కూడా బ్రేక్ చేసేసింది బాహుబలి 2 సినిమా.