సీత కూడా వాయిదాపడుతోందా?

Tuesday,March 26,2019 - 12:16 by Z_CLU

ఇప్పటికే అర్జున్ సురవరం వాయిదాపడింది. ఇప్పుడీ లిస్ట్ లోకి సీత కూడా చేరింది. అవును.. బెల్లకొండ, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సీత సినిమా కూడా వాయిదా పడొచ్చంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

లెక్కప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాలి. కానీ సినిమాకు సంబంధించి ఇంకా కొంత షూటింగ్ పార్ట్ పెండింగ్ లో ఉందట. దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా పెండింగ్ ఉందని తెలుస్తోంది. దీంతో సీత పోస్ట్ పోన్ అవ్వొచ్చంటున్నారు చాలామంది

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. బెల్లంకొండ, కాజల్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి కవచం సినిమా చేశారు.