సీత టైటిల్ లోగో రిలీజ్

Friday,January 25,2019 - 06:29 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు దర్శకుడు తేజ టైటిల్ లోగోను రిలీజ్ చేశాడు. సినిమాకు సంబంధించి రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది సీత సినిమా. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ పేరు సీత. ఆమె పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుందనే గాసిప్ నడుస్తోంది. టైటిల్ పై కూడా గతంలోనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తేజ అదే టైటిల్ ను ప్రకటించాడు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న సీత సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ నుంచి వస్తున్న సినిమా ఇదే.