మహర్షి స్థానాన్ని భర్తీచేసిన సీత

Friday,March 08,2019 - 05:33 by Z_CLU

మహర్షి సినిమా వాయిదాపడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25 నుంచి మే 9కి ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడా ప్లేస్ లోకి సీత వచ్చి చేరింది. అవును.. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు

ఉమెన్స్ డే సందర్భంగా సీత సినిమా నుంచి కాజల్ ఉన్న ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు కేవలం కాజల్ యాంగిల్ లో కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి లాంటి హిట్ తర్వాత తేజ నుంచి వస్తున్న మూవీ ఇదే.