సీత సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Sunday,May 05,2019 - 02:01 by Z_CLU

ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది సీత సినిమా. ఇప్పుడీ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 24న సీత సినిమా థియేటర్లలోకి వస్తుంది. మేకర్స్ కూడా ఇదే తేదీతో పోస్టర్ విడుదల చేశారు.

నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ డైరక్ట్ చేసిన మూవీ ఇదే. బెల్లంకొండ, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మన్నారా చోప్రా కనిపించనుంది. నటుడు సోనూ సూద్ ఈ మూవీతో విలన్ గా మరోసారి రీఎంట్రీ ఇస్తున్నాడు.

సినిమాలో కీలకమైన నటీనటులు, యూనిట్ సభ్యులందరికీ ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. అందుకే ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ మూవీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.