'సీత' వచ్చేదప్పుడే

Sunday,April 21,2019 - 04:02 by Z_CLU

తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న ‘సీత’ షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 25 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మే నెలకి పోస్ట్ పోన్ అయింది.  ప్రస్తుతానికి మేకర్స్  డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ మే రెండో వారంలో సినిమా థియేటర్స్ లోకొస్తుందని సమాచారం.

తెలుగులో కాస్త బ్రేక్ తీసుకున్న సోను సూద్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. పోస్టర్స్, టీజర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మే మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. మరి ‘సీత’తో తేజ మళ్ళీ ఏ రేంజ్ హిట్ కొడతాడో..చూడాలి.