తగ్గనిది తమన్నా ఒక్కతే...

Tuesday,November 19,2019 - 12:00 by Z_CLU

తమన్నా స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు… ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు రిలీజయ్యాయి. ఇలా ఏడాదికి 3 సినిమాలు చేయడం హీరోయిన్ కి కొత్త కాదు కానీ, స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ అందుకున్నాక గతంలోలా వచ్చిన సినిమాకల్లా సంతకం చేసుకుంటూ పోవడం జరగనిపని… అందుకే తమన్నా రేంజ్ హీరోయిన్స్ సమంతా… కాజల్ అగర్వాల్, అనుష్క లాంటి హీరోయిన్స్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. దాంతో న్యాచురల్ గానే స్పీడ్ తగ్గుతుంది.

 

జస్ట్ స్కిన్ షో కే పరిమితమయ్యే స్థాయిని తమన్నా ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఓ సినిమాలో తమన్నా ఉందంటే, ఆ క్యారెక్టర్ డెఫ్ఫినెట్ గా సమ్ థింగ్ స్పెషల్ అయి ఉండాల్సిందే. అటు తమన్నాని అప్రోచ్ అయ్యే మేకర్స్ అయినా, ఇటు సినిమాలు ఎంచుకునే విషయంలో తమన్నా అయినా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు… అయితే అంత పర్టికులర్ గా ఉన్నా, తమన్నాకి ఏ మాత్రం గ్యాప్ లేదు.

 

ఈ ఏడాది F2, అభినేత్రి 2… దానికి తోడు ‘సైరా’… ఇప్పుడు యాక్షన్… ఏ మాత్రం తగ్గలేదు తమన్నా. వీటితో పాటు అటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. 

కరియర్ బిగినింగ్ నుండి కమర్షియల్ సినిమా క్వీన్ అనిపించుకుంటున్న తమన్నా, ఇప్పటికీ స్టార్ హీరోల సరసన కూడా పవర్ ఫుల్ రోల్స్ డిమాండ్ చేయడంలో 100% సక్సెస్ అవుతుంది. అందుకే ఫీమేల్ సెంట్రిక్ సినిమాల వైపు దృష్టి కూడా పెట్టకుండా ఎప్పటిలాగే కలర్ ఫుల్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేస్తుంది తమన్నా.