మెగాస్టార్ – ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్

Friday,October 04,2019 - 09:02 by Z_CLU

‘సైరా’… అన్ని సినిమాల్లాగా ఓ దర్శకుడు కథ పట్టుకుని వచ్చి, నచ్చి… ‘చేసేద్దాం తమ్ముడూ’.. అని ఫిక్సయిన సినిమా కాదు. పదేళ్ళ క్రితం కేవలం మెగాస్టార్ కోసమే అని ఫిక్సయి పరుచూరి సోదరులు రాసుకున్న కథ. ఆ టైమ్ లో… గట్టిగా కూర్చుని లెక్కలు వేసుకుంటే 80 కోట్ల బడ్జెట్… టాలీవుడ్ లో అప్పటికి ఆ స్థాయిలో రిటర్న్స్ కూడా లేవు. లేకపోతే ఈ సినిమా అప్పుడే సెట్స్ పైకి వచ్చేది… అయితే ఈ సినిమా పదేళ్ళ క్రితమే తెరకెక్కి ఉంటే ఎలా ఉండేది…?

పెద్దగా తేడా ఉండేది కాదేమో.. సినిమా చూసిన తరవాత ఫ్యాన్స్ ఫీలింగ్ ఇది. పదేళ్ళ క్రితం మెగాస్టార్ వయసు 5 పదులు.. ఇప్పుడు 6 పదులు.. మహా అయితే నంబర్ మారింది అంతేకానీ మెగాస్టార్ కరిష్మా కించిత్ కూడా తగ్గలేదు. ‘సైరా’ లో ప్రతి సన్నివేశం… ‘చిరంజీవి’ అనే నటుడికి ఎందుకింత క్రేజ్ క్రియేట్ అయింది..? అని ఈ జనరేషన్ లో అక్కడక్కడ రేజ్ అయి ఉన్న ప్రశ్నకి సమాధానం చెప్తుంది.

యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేసుకున్నప్పుడు మేకర్స్ చిరు ఏజ్ ని మైండ్ లో పెట్టుకున్నారని ఒక్కచోట కూడా అనిపించదు… ఒక మాటలో చెప్పాలంటే అరవయ్యేళ్ళ చిరు.. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడు అనే ప్రశ్న కంటే.. అరవయ్యేళ్ళ అనుభవం ఉంది కాబట్టే ఓ స్టార్ హీరో ఈ స్థాయిలో పెర్ఫామ్ చేయగలిగాడు అనిపిస్తుంది.

ఈ తరం నటుల్లో చాలా మందికి చిరు ఇన్స్ పిరేషన్.. ఆయన సినిమాలు చూసి నటులవ్వాలనుకున్న వాళ్ళు లెక్కలేనంత మంది. అయితే ఇన్స్ పైర్ చేయడం చిరు ఇప్పటికీ ఆపలేదనిపిస్తుంది. ‘సైరా’తో ఇండస్ట్రీ టాప్ హీరోల ముందు మరో చాలెంజ్ ని జెనెరేట్ చేశాడు మెగాస్టార్. ఒక వ్యక్తి వల్ల ఇది సాధ్యమా..? అనే స్థాయిలో తన స్టామినా ఎలివేట్ చేశాడు.

‘సైరా’ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. స్వాతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చరిత్రని సిల్వర్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడం వన్ అండ్ ఓన్లీ స్టార్ ‘మెగాస్టార్’కే సాధ్యమనిపించింది. పరుచూరి సోదరులు… ‘చేస్తే ఈ సినిమా మెగాస్టార్ మాత్రమే చేయాలి’.. అని ఎందుకు ఫిక్సయ్యారో తెలిసింది.

జస్ట్ ఒక్క సినిమా అనుభవమే ఉన్న యంగెస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్, 300 కోట్ల బడ్జెట్ తో ఎందుకింత సాహసం చేస్తున్నాడు…? అనుకున్న వారికి ‘సైరా’ సక్సెస్ సైలెంట్ గా సమాధానం చెప్పింది. ‘చిరు ఫిక్సవ్వాలి కానీ ఎలాంటి సినిమా చేసినా రఫ్ఫాడేస్తుంది… ఏజ్ కి చిరంజీవి పర్ఫామెన్స్ కి అసలు సంబంధమే లేద’ని మరోసారి ప్రూఫ్ అయింది…