చరిత్ర పాతదే.. పాయింట్ మాత్రం కొత్తది

Wednesday,October 02,2019 - 09:02 by Z_CLU

ఒక్క ఫ్రీడమ్ ఫైటర్స్ విషయంలోనే కాదు, చరిత్రలో ఎవరికి సంబంధించిన సినిమా తెరకెక్కిన మ్యాగ్జిమం అందరికీ తెలిసిన విషయాలే తెరకెక్కేవి. ఎక్కడో పుస్తకాల్లో చదువుకున్న విషయాలు, సిల్వర్ స్క్రీన్ పై చూపించడమే ఆ సినిమాల టార్గెట్. కానీ పద్ధతి మారింది. జరిగిన కథనే తమ పాయింట్ ఆఫ్ వ్యూలో మరింత ఎట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేస్తున్నారు మేకర్స్. వీలైతే చరిత్రలో మరుగునపడ్డ విషయాలకు మరింత ప్రాణం పోసి ఆడియెన్స్ కి దగ్గర చేస్తున్నారు.

 

సైరా నరసింహా రెడ్డి : బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన ప్రతి యోధుడు వీరమరణం పొందాడు… ఇలాంటి కథలు చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నాం. కానీ నరసింహారెడ్డిని కొన్నాళ్ళ పాటు అలాగే ఉరి తీసిన చోటే ఉంచడం జరిగింది. సురేందర్ రెడ్డి పెన్ను కదిలింది ఇక్కడే… బ్రిటీష్ పాలకులకు ఆ స్థాయిలో కసి పెరిగేలా.. నరసింహారెడ్డి ఏం చేసి ఉంటాడు…? జనంలో ఈ యోధుడు రేజ్ చేసిన ఆలోచన ఏమిటీ..? ఇదే ‘సైరా’ లో కీ పాయింట్… నరసింహా రెడ్డి చరిత్ర తెలిసిన వారికి కూడా ఈ యాంగిల్ కొత్తగా కనెక్ట్ అవుతుంది.. అందుకే సైరా రిలీజ్ అయిన మొదటి రోజే సక్సెస్ ట్రాక్ ఎక్కింది. 

రుద్రమదేవికాకతీయుల ప్రస్తావన రాగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది రాణి రుద్రమదేవి. కానీ బాల్యంలో తల్లిదండ్రులు ఆమెను ప్రపంచానికి ‘అబ్బాయి’గా పరిచయం చేయడం, ఒక పర్టికులర్ సందర్భం వరకు ఈ నిజాన్ని గోప్యంగా ఉంచడం లాంటివి డిస్కస్ చేయాలనుకోవడం దర్శకుడు గుణశేఖర్ ఎంచుకున్న విధానం… అందుకే తెలిసిన కథే అయినా ఈ విధానం కొత్తది కావడం.. రుద్రమదేవిని కొత్తగా చూసిన ఫీలింగ్ కలిగించింది.   

గౌతమీపుత్ర శాతకర్ణీ: ఈ సినిమాలో దర్శకుడు కీ పాయింట్స్ గా ఎంచుకున్న విషయాలు ఒకటి.. దేశాన్ని ఒక్క తాటిపై నడిపించడం కోసం శాతకర్ణీ సామ్రాజ్యాన్ని విస్తరించడం.. ఇక రెండోది ఈ కథలో ఎక్కడో చిన్న పాయింట్ గా మిగిలిపోయిన తల్లి ప్రాముఖ్యతని రిజిస్టర్ అయ్యేలా ప్రెజెంట్ చేయడం… ఇది క్రిష్ తన యాంగిల్ లో కొత్తగా రాసుకున్న కథ.

ఇలా మనకు తెలిసిన చరిత్రనే సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు నేటితరం దర్శకులు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన భగత్ సింగ్ పాత్రను కూడా ఇలా కొత్తగా ఆవిష్కరిస్తూ, రామ్ చరణ్ తో ఎవరైనా ఆ సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు చిరంజీవి.