బాలయ్య పైసా వసూల్ అప్ డేట్స్

Tuesday,July 04,2017 - 05:14 by Z_CLU

మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలయ్య 101 వ సినిమా ‘పైసా వసూల్’ సక్సెస్ ఫుల్ గా పోర్చుగల్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. 40 రోజుల పాటు జరిగిన ఈ భారీ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించింది సినిమా యూనిట్.

ఇక సోమవారం నుండి నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేయనున్న పైసా వసూల్ టీమ్, హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వరసగా నాలుగు రోజులు సాంగ్ పిక్చరైజేషన్, ఆ తరవాత 4 రోజులు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించనుంది. మొత్తానికి ఈ షెడ్యూల్స్ తో సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్టే.

 

శ్రియ శరణ్, ముస్కాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ లా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య ఒక పాట కూడా పాడాడు. రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ లో ఈ రేంజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ‘పైసా వసూల్’ కి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాని సెప్టెంబర్ 29 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.