సర్ ప్రైజ్ చేసిన కళ్యాణ్ రామ్

Tuesday,July 04,2017 - 06:31 by Z_CLU

కళ్యాణ్ రామ్ MLA ( మంచి లక్షణాలున్న అబ్బాయి) ఫస్ట్ లుక్ రిలీజయింది. రేపు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

 

 

ఫన్ లోడెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త క్యారెక్టరైజేషన్ తో ఎట్రాక్ట్ చేయబోతున్నాడు. కళ్యాణ్ రామ్ ఓ వైపు NTR తో ‘జై లవకుశ’ సినిమాను నిర్మిస్తూనే మరో వైపు M.L.A. సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని భరత్ చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.