బాహుబలి ప్రీమియర్ షోకి బ్రేక్

Thursday,April 27,2017 - 03:01 by Z_CLU

బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా మరణం ఆయన అభిమానుల్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. అందుకే ఆయనపై గౌరవంతో వరల్డ్ వైడ్ గా ఈ రోజు  బాహుబలి 2 ప్రీమియర్ షో స్ జరుగుతున్నా, ముంబై లో క్యాన్సిల్ చేసేసింది బాహుబలి టీమ్. బాలీవుడ్ లో ఈ రోజు  బాహుబలి 2 ప్రీమియర్ షోస్ ఉండవు.

కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో కన్ఫం చేసిన కాసేపటికే రాజమౌళి కూడా ఈ విషయాన్ని కన్ఫం చేస్తూ ట్వీట్ చేశాడు. చాలా రోజులుగా బ్లాడర్ క్యాన్సర్ తో బాధపడుతున్న వినోద్ ఖన్నా ఈ రోజు మార్నింగ్ లోకల్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.