అవన్నీ కామనే

Thursday,April 27,2017 - 04:00 by Z_CLU

ఎన్టీఆర్-రాజమౌళి ఎప్పుడు కలిసినా యంగ్ టైగర్ క్వశ్చన్ ఒక్కటే. తనతో ఎప్పుడు సినిమా చేస్తారని రాజమౌళిని అడుగుతూనే ఉంటాడు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు, రాజమౌళితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు రెడీగా ఉన్నారు. ఇదే విషయం అడిగినప్పుడు దానిపై జక్కన్న తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యాడు.

తమతో సినిమాలు చేయమని పదేపదే కొందరు స్టార్లు మిమ్మల్ని అడుగుతున్నారు కదా.. మీరు వారితో సినిమా చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు..? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. ఒక దర్శకుడితో క్లోజ్ గా ఉండే ఒక హీరో.. ఆ డైరెక్టర్ ని నాతో సినిమా ఎప్పుడు చేస్తావని అడగడం కామనే కదా అన్నాడు రాజమౌళి.

ఒక డైరెక్టర్ తో కాస్త క్లోజ్ గా ఉండే హీరో ఆ డైరెక్టర్ తో పనిచేయాలనుకోవడం.. సినిమా చేయమని అడగడం కామన్ అంటున్నాడు జక్కన్న. ఇదే విషయాన్ని రివర్స్ లో కూడా చెప్పాడు. తనకి క్లోజ్ గా ఉండే హీరోను డైరెక్టర్స్ కూడా సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తుంటారని అన్నాడు. అయితే తన విషయానికొస్తే కథ కుదిరినప్పుడు… ఆ సినిమాకి టైం వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తానని ప్రకటించాడు రాజమౌళి. తనతో సినిమా ఎప్పుడు చేస్తావని హీరోలంతా సరదాగా అడుగుతుంటారు తప్పితే… తమ మధ్య వాటి గురించి సీరియస్ డిస్కషన్ ఉండదంటున్నాడు జక్కన్న.