బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఇకలేరు

Thursday,April 27,2017 - 01:20 by Z_CLU

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఈ రోజు ఉదయం కన్ను మూశారు. కొన్ని రోజులుగా బ్లాడర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. భారతీయ జనతా పార్టీ MP గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన రీసెంట్ గా డీహైడ్రేషన్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చేరారని తెలుస్తుంది.

ఎన్నో సినిమాల్లో హీరోగా అలరించిన ఆయనకి ‘మేరె అప్నే’, గద్దార్, ఖుద్రత్, దయావన్, కార్నామా, సూర్య, ఖుర్బానీ లాంటి సినిమాలు ఆయన్ని స్టార్ ఇమేజ్ కి మరింత దగ్గర చేశాయి. ‘హాత్ కి సఫాయి’ సినిమాలో ఆయన చేసిన సపోర్టింగ్ రోల్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దక్కింది.

కొన్ని సంవత్సరాలుగా కేవలం పొలిటికల్ కరియర్ పైనే దృష్టి పెట్టిన ఆయన రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ తో పాటు ‘దబాంగ్ 2’, షారుక్ ఖాన్ ‘దిల్ వాలే’ సినిమాలలో చివరి సారిగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వినోద్ ఖన్నా మృతిపై బాలీవుడ్ మొత్తం ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, ఆ మహానటుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుంది జీ సినిమాలు.