తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 తాజా వసూళ్లు

Monday,May 22,2017 - 05:38 by Z_CLU

బాహుబలి ది కంక్లూజన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 150కోట్ల రూపాయల షేర్ క్రాస్ చేసిన ఈ మూవీ.. త్వరలోనే 200 కోట్ల రూపాయల షేర్ సాధించడం ఖాయం. ఎందుకంటే.. విడుదలైన 24 రోజుల్లోనే ఈ సినిమాకు 182 కోట్ల రూపాయలు వచ్చాయి. నిన్నటివరకు వచ్చిన మొత్తమిది.

ట్రేడ్ ఎనలిస్ట్ ల అంచనా ప్రకారం.. ఈ శుక్రవారానికి ఈ సినిమా 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు. ఒక్క ఏపీ, తెలంగాణలోనే 200 కోట్ల రూపాయలు వస్తాయని ఇప్పటివరకు ఎవరూ ఊహించలేదు. ఆ కలను నిజం చేయబోతోంది బాహుబలి-2.

తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో బాహుబలి సాధించిన వసూళ్లు. (షేర్)

నైజాం – 62.27 కోట్లు

సీడెడ్ – 31.90 కోట్లు

ఉత్తరాంధ్ర – 24.09 కోట్లు

వెస్ట్ – 11.63 కోట్లు

కృష్ణా – 13.07 కోట్లు

నెల్లూరు – 7.15 కోట్లు

ఈస్ట్ – 16.01 కోట్లు

గుంటూరు – 16.60 కోట్లు

మొత్తం వసూళ్లు – 182. 72 కోట్లు